ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నిధి 7-6 (7/5), 6-4 స్కోరుతో మన రాష్ట్రానికే చెందిన కాల్వ భువనపై విజయం సాధించింది. సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నిధి, క్వార్టర్స్‌లో మూడో సీడ్ రిషిక సుంకరతో తలపడుతుంది.
ప్రిక్వార్టర్స్‌లో రిషిక 6-2, 6-2తో అమృత ముఖర్జీని ఓడించింది. మరో ఏపీ అమ్మాయి సౌజన్య భవిషెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్‌లో ఆమె 4-6, 6-2, 6-1 తేడాతో నాలుగో సీడ్ జపాన్ క్రీడాకారిణి ఎమి ముతగుచిని ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె రుతుజ భోంస్లేను ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో అంకితా రాణాతో ప్రేరణ బాంబ్రీ, నటాషా పల్హాతో ప్రార్థన తోంబరే తలపడతారు.
డబుల్స్‌లో ఏపీకి చెందిన సౌజన్య భవిషెట్టి జోడి క్వార్టర్స్‌కు చేరగా, అక్షర ఇస్కా-తీర్థ ఇస్కా జంటకు పరాజయం ఎదురైంది. సౌజన్య-షర్మద 6-0, 6-0తో ముతగుచి-నునోమె (జపాన్)ను చిత్తు చేయగా, శ్వేత రాణా-రిషిక సుంకర జంట 6-4, 6-1తో ఇస్కా అక్షర-ఇస్కా తీర్థలపై నెగ్గింది.
నిధి, సౌజన్య ముందంజ
Published Wed, Jan 8 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement