చిన్నారులకు మార్టినా పాఠాలు | Martina lessons for children | Sakshi
Sakshi News home page

చిన్నారులకు మార్టినా పాఠాలు

Published Thu, Jul 16 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

చిన్నారులకు మార్టినా పాఠాలు

చిన్నారులకు మార్టినా పాఠాలు

సానియా అకాడమీలో సందడి
 
సాక్షి, హైదరాబాద్ : టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నగరంలో సందడి చేసింది. ‘డబ్ల్యూటీఏ-ఆసియా పసిఫిక్ టెన్నిస్ మాస్టర్ క్లాసెస్’ ప్రచారంలో భాగంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె పాఠాలు నేర్పించింది. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో ముచ్చటించిన మార్టినా, అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగేందుకు తీవ్రంగా శ్రమించాలంటూ వారిలో స్ఫూర్తి నింపింది. ఈ సందర్భంగా డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జాను ప్రత్యేకంగా అభినందించిన మార్టినా... డబ్ల్యూటీఏ తరఫున జ్ఞాపికను అందజేసింది. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఏ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ మెలీసా పైన్, భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి కర్మణ్ కౌర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement