
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ కార్పొరేట్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో డి. మనీశ్ అదరగొట్టాడు. మణికొండలోని ప్రొఫెషనల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో మనీశ్ పురుషుల సింగిల్స్, 40 ప్లస్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి మూడు టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో మనీశ్ 8–1తో సాగర్‌పై గెలుపొందాడు. 40 ప్లస్ వయో విభాగంలో మనీశ్ 8–0తో దేవరకొండ రవిశంకర్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు డబుల్స్ విభాగంలో ధీరజ్–మనీశ్ జంట 8–1తో రవిశంకర్–నాగ్ జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాగర్–రవి ద్వయం 8–3తో ప్రశాంత్ రెడ్డి–ఉదయ్ శంకర్ జంటపై గెలిచి ట్రోఫీని అందుకుంది.