
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ రేపటి నుంచి జరుగనుంది. కొంపల్లిలోని జి. బంగారు రాజు కల్చరల్ సొసైటీ వేదికగా అండర్–16, 18 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.
ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల కోసం శనివారం క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించారు. నేటితో క్వాలిఫయింగ్ పోటీలు ముగుస్తాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఐటా టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు ఐటా టోర్నీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment