బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 6–1, 3–6, 6–1తో క్వాలిఫయర్ యూసుఫ్ హసమ్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) జంట 6–3, 7–6 (7/5)తో ప్రజ్వల్ దేవ్–నికీ పునాచా (భారత్) జోడీపై గెలిచింది.
సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సుమీత్ 6–3, 7–6 (7/4)తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ 4–6, 6–4, 7–5తో సెబాస్టియన్ (జర్మనీ)పై గెలి చారు. శశికుమార్‌తో మ్యాచ్‌లో స్కోరు 6–7 (2/7), 1–3 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా బ్లాజ్ కావిచ్ (స్లొవేనియా) వైదొలిగాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (3/7), 3–6తో పర్సెల్–సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment