సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ రెడ్డి తనకన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయికార్తీక్ రెడ్డి 6–2, 6–4తో రెండోసీడ్ విలాసిర్ (హరియాణా)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయికార్తీక్ 4–6, 6–3, 6–2తో కైవల్య కలాంసే (మహారాష్ట్ర)పై పోరాడి గెలిచాడు. రెండో రౌండ్‌లో 3–6, 6–0, 6–2తో వి. హేవంత్ (తెలంగాణ)పై, తొలి రెండ్‌లో ఏకే రోహిత్‌పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment