Sai Karthik reddy
-
సాయికార్తీక్ రెడ్డికి సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో అన్‌సీడెడ్ సాయికార్తీక్ 6–3, 6–3తో టాప్ సీడ్ అన్షు కుమార్ భూయాన్ (ఒడిశా)ను కంగుతినిపించాడు. ఈ టోర్నమెంట్ ఆసాంతం నిలకడగా ఆడిన సాయికార్తీక్... జనవరిలో జరిగిన ఖేలో ఇండియా చాంపియన్‌షిప్‌లో అండర్–21 పురుషుల సింగిల్స్, డబుల్స్ కేటగిరీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. -
టైటిల్ పోరుకు సాయికార్తీక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ రెడ్డి తనకన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయికార్తీక్ రెడ్డి 6–2, 6–4తో రెండోసీడ్ విలాసిర్ (హరియాణా)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయికార్తీక్ 4–6, 6–3, 6–2తో కైవల్య కలాంసే (మహారాష్ట్ర)పై పోరాడి గెలిచాడు. రెండో రౌండ్లో 3–6, 6–0, 6–2తో వి. హేవంత్ (తెలంగాణ)పై, తొలి రెండ్లో ఏకే రోహిత్‌పై గెలుపొందాడు. -
సెమీస్‌లో సాయి కార్తీక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సాయి కార్తీక్‌రెడ్డి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఐదోసీడ్ గంటా సాయి కార్తీక్‌రెడ్డి 6–1, 7–6 (6)తో కబీర్ హాన్స్‌పై విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ ఎం. తీర్థ శశాంక్ 0–6, 1–6తో మేఘ్ భార్గవ్ పటేల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. డెనిమ్ యాదవ్ 6–1, 6–4తో అనురా అగర్వాల్‌పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో తీర్థ శశాంక్ జోడీ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో నాలుగోసీడ్ తీర్థ శశాంక్ – కెవిన్ పటేల్ ద్వయం 6–4, 6–2తో కృషన్ హుడా– డివిన్ వాద్వా జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో సాయికార్తీక్ రెడ్డి– నైథాలిన్ కెల్విన్ జోడీ 6–7 (6), 1–6తో కబీర్ హాన్స్– తేజస్వి ఆర్. మెహ్రా ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి రెండోసీడ్ శివాని అమినేని 3–6, 3–6తో సందీప్తి సింగ్ రావు చేతిలో ఓటమి పాలైంది. బాలికల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ శివాని అమినేని (భారత్)– మయి నపట్ నిరుండర్న్ (థాయ్‌లాండ్) ద్వయం 6–3, 6–3తో అనన్య– భక్తి షా (భారత్) జంటపై నెగ్గి సెమీస్‌కు చేరింది. ,, ,