సాయికార్తీక్‌ రెడ్డికి సింగిల్స్‌ టైటిల్‌ | Sai Karthik Reddy Wins Singles Title of AITA | Sakshi
Sakshi News home page

సాయికార్తీక్‌ రెడ్డికి సింగిల్స్‌ టైటిల్‌

Published Sun, May 19 2019 9:55 AM | Last Updated on Sun, May 19 2019 9:55 AM

Sai Karthik Reddy Wins Singles Title of AITA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల్‌ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్‌ రెడ్డి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్‌ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ టైటిల్‌పోరులో అన్‌సీడెడ్‌ సాయికార్తీక్‌ 6–3, 6–3తో టాప్‌ సీడ్‌ అన్షు కుమార్‌ భూయాన్‌ (ఒడిశా)ను కంగుతినిపించాడు. ఈ టోర్నమెంట్‌ ఆసాంతం నిలకడగా ఆడిన సాయికార్తీక్‌... జనవరిలో జరిగిన ఖేలో ఇండియా చాంపియన్‌షిప్‌లో అండర్‌–21 పురుషుల సింగిల్స్, డబుల్స్‌ కేటగిరీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement