సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నాన్‌చాంగ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తొలి రౌండ్‌లోనే పరాజయం చవిచూశాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ 4–6, 4–6తో జీజెన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
82 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ 2–6, 4–6తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment