
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–3, 6–3తో అవిష్క గుప్తా (జార్ఖండ్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములతో దేదీప్య తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment