
సాక్షి, హైదరాబాద్: ఇండియా టెన్నిస్ లీగ్ (ఐటీసీ) టోర్నమెంట్‌లో సరోజిని క్రికెట్, టెన్నిస్ అకాడమీ విద్యార్థి రూహి సత్తా చాటింది. గచ్చిబౌలిలోని నూర్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
గురువారం జరిగిన టైటిల్‌పోరులో రూహి 4–1, 4–2తో రహీన్‌పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్‌లో 2–4, 4–1, 4–4 (10–8)తో చరికా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 4–2, 4–1తో నలమర్తిపై విజయం సాధించింది. ఐటీసీ టైటిల్‌ను సాధించిన రూహిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జీఆర్ కిరణ్ అభినందించారు.
,