సెమీస్‌లో ఉద్భవ్, అపూర్వ | Udhav and apoorva enter semis of championship series tennis tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఉద్భవ్, అపూర్వ

Published Fri, Nov 17 2017 12:08 PM | Last Updated on Fri, Nov 17 2017 12:08 PM

Udhav and apoorva enter semis of championship series tennis tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాంపియన్‌షిప్‌ సిరీస్‌ అండర్‌–12, 14 బాలబాలికల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు ఉద్భవ్, అపూర్వ వేమూరి నిలకడగా రాణిస్తున్నారు. ఆనంద్‌ టెన్నిస్‌ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో వీరిద్దరూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన అండర్‌–14 బాలుర సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఉద్భవ్‌ 6–0, 6–2తో సి. ఆర్యంత్‌ రెడ్డిపై గెలుపొందగా, బాలికల విభాగంలో అపూర్వ 6–2, 6–3తో శ్రీహితను ఓడించింది. ఇతర బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో అభయ వేమూరి 6–2, 6–3తో నీలా కుంకుమ్‌పై, ఐరా షా 1–6, 6–3, 6–3తో కె. మలిష్కపై, సౌమ్య 6–1, 6–3తో జాహ్నవిపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. బాలుర క్వార్టర్స్‌లో మోహిత్‌ సాయిచరణ్‌ రెడ్డి 6–3, 2–6, 6–4తో సిద్ధార్థ్‌ శ్రీనివాస్‌పై, కార్తీక్‌ నీల్‌ 6–0, 6–2తో టి. శ్రీప్రణవ్‌పై, రోహన్‌ 1–6, 6–2, 6–3తో వర్షిత్‌ కుమార్‌రెడ్డిపై నెగ్గారు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

అండర్‌–12 బాలుర క్వార్టర్స్‌: సమీర్‌ 6–2, 6–3తో వినీత్‌ ముత్యాలపై, మోహిత్‌ సాయిచరణ్‌ 6–1, 6–3తో మహాలింగం (తమిళనాడు)పై, అర్నవ్‌ (మహారాష్ట్ర) 6–3, 4–6, 7–6 (2)తో భీమ (ఏపీ)పై, శ్రీశరణ్‌ 6–1, 4–6, 6–3తో శ్రీహరిపై గెలుపొందారు.  

బాలికల క్వార్టర్స్‌: నిరాలి 6–1, 6–0తో ఐరా షా (మహారాష్ట్ర)పై, అభయ 6–1, 7–5తో రిధి చౌదరిపై, సౌమ్య 6–2, 7–6 (6)తో అపూర్వపై, శివాని 6–0, 5–7, 7–6 (5)తో కె. మలిష్కపై విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement