
సాక్షి, హైదరాబాద్: గౌస్ మొహమ్మద్ ఖాన్ డే–నైట్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జి. నైషిక్ రెడ్డి, జష్విత రెడ్డి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్–12 బాలుర ఫైనల్లో నైషిక్ 6–0తో మురళి కౌషాన్‌పై గెలుపొందగా, బాలికల విభాగంలో జష్విత 6–4తో వన్షికను ఓడించింది. అండర్–10 కేటగిరీలో కేఎల్ రాహుల్, హర్షిణి విజేతలుగా నిలిచారు.
బాలుర సింగిల్స్ ఫైనల్లో రాహుల్ 6–4తో శామ్యూల్‌పై, విజయం సాధించాడు. బాలికల విభాగంలో హర్షిణి 6–5తో వన్షికను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అండర్–8 బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇరిత్ 6–4తో దైవిక్‌పై విజయం సాధించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ హెచ్‌జె దొర ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.