
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా సత్తా చాటింది. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
శనివారం జరిగిన టైటిల్‌పోరులో హుమేరా 6–1, 4–6, 7–5తో యుబ్రాని బెనర్జీ (కోల్‌కతా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో హుమేరా 40 ర్యాంకింగ్ పాయింట్లు సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ పునాచ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–3, 6–4తో దక్షిణేశ్వర్ సురేశ్‌పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment