పారిస్: యూరప్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే ఫుట్‌బాల్ టోర్నీలు ఆరంభమైన నేపథ్యంలో తాజాగా జూలై నుంచి ఫ్రాన్స్‌లో టెన్నిస్ టోర్నీలను నిర్వహించనున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్‌ఎఫ్‌టీ) శనివారం ప్రకటించింది. ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతమైన రివియెరాలో నిర్వహించే మినీ టూర్‌తో టెన్నిస్ క్రీడకు తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు ఎఫ్‌ఎఫ్‌టీ తెలిపింది.
ఈ మినీ టూర్‌లో మొత్తం మూడు టోర్నీలు ఉండగా... ఆరంభ టోర్నీ నీస్‌లో జూలై 6–11 మధ్య... రెండో టోర్నీ కేన్స్‌లో జూలై 13–18 మధ్య... చివరిదైన మూడో టోర్నీ విల్నెవ్–లుబేలో జూలై 20–25 మధ్య జరుగుతాయి. ‘చాలెంజ్ ఎలైట్ ఎఫ్‌ఎఫ్‌టీ’ పేరుతో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీల్లో పురుషుల విభాగంలో 24 మంది... మహిళల విభాగంలో 12 మంది బరిలోకి దిగుతారు.
Comments
Please login to add a commentAdd a comment