సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారుల పోరాటం ముగిసింది. బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సెమీస్‌లో వెనుదిరగగా, బాలికల కేటగిరీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు.
ఢిల్లీలో గురువారం జరిగిన బాలుర డబుల్స్ సెమీస్‌లో రిత్విక్– అభిమన్యు (భారత్) జంట 6–7 (6), 2–6తో యాసిర్ కిలాని (మొరాకో)– బ్రాండన్ (వెనిజులా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–3, 1–6, 2–6తో ఆకాంక్ష (భారత్) చేతిలో ఓడిపోయింది. శివాని 6–1, 2–1తో ఆధిక్యం లో ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంది. ఫలితంగా ఆమె ప్రత్యర్థి మయ్ నపట్ నిరుండోర్న్ (థాయ్‌లాండ్) సెమీస్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment