
రష్మికకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సత్తా చాటింది. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఆమె విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక (భారత్) 6–4, 6–2తో టాప్ సీడ్ యుజియావో (చైనా)ను కంగు తినిపించింది.