
సాక్షి, హైదరాబాద్: చెక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ పోరాటం ముగిసింది. చెక్ రిపబ్లిక్‌లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో విష్ణువర్ధన్ (భారత్)–నికోలా కాసిచ్ (సెర్బియా) ద్వయం 2–6, 6–4, 8–10తో రెండో సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలానీ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జంట నాలుగు ఏస్‌లు సంధించి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్‌లో ఓడిన విష్ణు జోడీకి 610 యూరోలు (రూ. 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment