
క్వార్టర్స్‌లో శివాని
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని రాణిస్తోంది. ఉజ్బెకిస్తాన్‌లోని ఫెరంగాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శివాని 6–4, 6–4తో దరియా దెట్‌కోవ్‌స్కయా (కజకిస్తాన్)పై విజయం సాధించింది.