ఇస్లామాబాద్: డేవిస్‌కప్ గ్రూప్–1 ప్లేఆఫ్ పోరులో భాగంగా పాకిస్తాన్ జట్టుతో తలపడేందుకు 1964 తర్వాత భారత జట్టు మళ్లీ పాకిస్తాన్‌లో అడుగు పెట్టింది. రామ్‌కుమార్, శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, దిగ్వి జయ్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత బృందంలో ఉన్నారు. చివరిసారిగా భారత్, పాక్‌లు 1964లో పాక్ గడ్డపై పోటీపడ్డాయి.
2019లోనూ పాకిస్తాన్‌లో భారత జట్టు పర్యటించాల్సి ఉండగా... ఈ మ్యాచ్‌ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తటస్థ వేదిక కజకిస్తాన్‌కు మార్చింది. ఈ పోరులో భారత్ 4–1తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈసారి మాత్రం పాకిస్తాన్‌లో భారత జట్టు ఆడాల్సిందేనని, వేదిక మార్చడం వీలుకాదని ఐటీఎఫ్ స్పష్టం చేసింది.
భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌రోహిత్ రాజ్‌పాల్ వ్యక్తిగత కారణాలతో పాకిస్తాన్‌కు వెళ్లలేకపోవడంతో జీషాన్ అలీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కోచ్‌గా వచ్చిన జీషాన్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గానూ వ్యవహరిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment