సౌజన్యకు మూడో సీడింగ్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో ముగ్గురు హైదరాబాద్ క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నగరానికి చెందిన భవిశెట్టి సౌజన్య, నిధి చిలుముల, ప్రాంజల ఈ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు.
మహిళల సింగిల్స్ విభాగంలో సౌజన్య మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుండగా... నిధి, ప్రాంజలకు వరుసగా ఐదు, ఏడో సీడింగ్స్ దక్కాయి. డబుల్స్ విభాగంలో నిధి–శ్వేత రాణా జోడీకి రెండో సీడ్ దక్కగా, ప్రాంజల జంట మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుంది.