sowjanya
-
ఫోటోలో ఎవరో తెలుసా..? డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న టాప్ దర్శకుడి కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టడమే కాకుండా బాక్సాఫీసుల వద్ద కలెక్షన్స్ సునామీని తెచ్చిన డైరెక్టర్‌గా ఆయనకు ఎనలేని గుర్తింపు ఉంది. అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు, ఇటు మాస్‌ను మెప్పించగల దర్శకుడు ఆయన. కొద్దిరోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఆమె కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్- మీనాక్షి చౌదరి కాంబోలో ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మాతగా సౌజన్యనే తెరకెక్కిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్-సౌజన్య కుమారుడు రిషీ మనోజ్ దర్శకుడిగా పరిచయం కానున్నట్లు ధృవీకరించారు. ఇప్పటికే రిషీ పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌తో పాటు అతని కుటుంబం ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. ఇటీవలే సౌజన్య తన సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా రావడం ప్రారంభించారు. అయితే, ఇదిగో త్రివిక్రమ్ కుమారుడు రిషీ తాజా చిత్రం అంటూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు రాజా చెంబోలు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని షేర్ చేశాడు. ఆ ఫోటోలో సౌజన్య కూడా ఉన్నారు. ముగ్గురూ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ డైరెక్టర్ పిల్లలు మాత్రం పెద్దగా సినీ ఇండిస్ట్రీలో అడుగుపెట్టన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. టాలెంట్ ఉంటేనే ఈ పరిశ్రమలో సక్సెస్ అవుతారు. మొదటి అడుగు వరకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. ఆపై కొనసాగాలంటే తనలోని సత్తాను నమ్ముకోవాల్సిందే. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ కొడతారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. -
సౌజన్య కేసులో నోరు విప్పితే అంతే
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లాలో పీయూసీ విద్యార్థిని సౌజన్య హత్య రహస్యాలను బయటపెడితే తనను కూడా హత్య చేసే అవకాశం ఉందని బెళ్తంగడి మాజీ ఎమ్మెల్యే వసంత బంగేర అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సౌజన్య అత్యాచారం, హత్య కేసును సీబీఐ దారి తప్పించింది. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశాను. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య పిలిచి సీబీఐకి అప్పగించడం సాధ్యం కాదన్నారు. బెళ్తంగడిలో జరిగిన అనేక హత్యల గురించి కూడా సీఎంకు చెప్పాను, చివరకు సీబీఐ విచారణకు ఇచ్చారు. సౌజన్య హత్య గురించి ఏమైనా మాట్లాడితే తాను కూడా హత్యకు గురి కావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా పెండింగ్ కేసు... సౌజన్య హత్యాచారం ఘటన దక్షిణ కన్నడ జిల్లాలో కొన్నినెలలుగా మళ్లీ చర్చనీయాంశమైంది. పోటాపోటీగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. 2012 అక్టోబరు 9న ఉజిరె పట్టణంలో కాలేజీకి వెళ్లిన సౌజన్య (17) మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రంతా పోలీసులు, స్థానికులు గాలించగా ఇంటికి వెళ్లే దారిలో చిట్టడవిలో శవమై కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని విచారణలో తేలింది. సమీపంలో జీవించే సంతోష్ రావ్ (34) అనే ఒంటరి మనిషి ఈ హత్య చేశాడని అరెస్టు చేశారు, కానీ నేరం చేయలేదని తెలిసి కొన్నినెలలకు వదిలేశారు. జిల్లాలో బడా బాబులకు చెందిన పిల్లలే సౌజన్యపై అఘాయిత్యం చేసి హతమార్చారని ఆమె బంధువులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సీబీఐ కూడా దోషులను కనిపెట్టలేకపోయింది. -
అయ్యో బాబోయ్ వీళ్ల ఆన్సర్స్ చూస్తే ఎలాంటివాడైన పడి పడి నవ్వాల్సిందే...!
-
నా మ్యూజిక్ జర్నీలో ఎన్ని మలుపులు ఉన్నాయి అంటే..!
-
ఈ ఇంటర్వ్యూ ఒక లెక్క అయితే వీళ్ళు ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్..!
-
Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లిలోని దూబే కాలనీ రోడ్డు నెంబర్–11లో నివాసముంటున్న ఉమారాణి, వెంకటాచారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కుమ్మరి సౌజన్య (21) బాచుపల్లిలోని డీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదువుతోంది. సౌజన్య గతంలో యూట్యూబ్ చానల్లో పనిచేస్తూ వీడియోలు తీస్తుండేది. అందులో పనిచేస్తున్న విజయ్‌తో సన్నిహితంగా ఉండేవారు. శుక్రవారం తల్లి ఉమారాణి మొయినాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లగా ఆ రాత్రి ఇంట్లో సౌజన్య ఉరేసుకొంది. కాగా అదే సమయంలో విజయ్ సౌజన్యకు ఫోన్ చేయగా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడికి వచ్చి ఉరి వేసుకున్నది చూసి తాడు తెంచి వేశాడు. పక్క ఇంటిలో అద్దెకు ఉంటున్న సారంగపాణికి సమాచారం అందించి పారిపోయాడు. సారంగపాణి చందానగర్ పోలీసులు, తల్లి ఉమారాణీకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే సౌజన్య మృతి చెంది ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌పై అనుమానంతో కుటుంబ సభ్యులు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కుటుంబాన్ని కబళించిన ప్రేమ వివాహం) -
సెమీస్‌లో సౌజన్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సౌజన్య భవిశెట్టి రాణిస్తోంది. టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి పెట్రా జనుస్కోవా (కెనడా)తో కలిసి సౌజన్య డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సౌజన్య (భారత్)– పెట్రా జనుస్కోవా (కెనడా) ద్వయం 4–6, 6–3, 10–7తో సకురా హొసోజి (జపాన్)–డెనిజ్ (టర్కీ) జంటపై గెలుపొంది సెమీస్‌లో అడుగు పెట్టింది. మరోవైపు సింగిల్స్ తొలి రౌండ్లో సౌజన్య 2–6, 6–3, 2–6తో క్రిస్టినా మిలెన్‌కోవిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. -
సౌజన్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలోని యానింగ్ నగరంలో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య (భారత్)–డాన్ ని వాంగ్ (చైనా) ద్వయం 7–6 (7/4), 7–5తో మూడో సీడ్ ఐసువాన్ చో–యి సెన్ చో (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. 24 ఏళ్ల సౌజన్యకిది కెరీర్లో ఎనిమిదో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2015లో రిషిక సుంకరతో కలిసి నాసిక్ ఐటీఎఫ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సౌజన్య నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. -
యాంకర్ భర్తకు రెండో పెళ్లి..
విశాఖపట్నం ,నర్సీపట్నం: వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఒక యాంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు. -
తన జీవితానికి తానే న్యాయమూర్తి
కోర్టులో న్యాయమూర్తులు వినిపించే జడ్జిమెంట్‌ను రాసుకునే స్థాయి నుంచి ఆమె డిక్టేషన్ చేసే స్థాయికి ఎదిగింది. కోర్టులో స్టెనోగా పనిచేస్తూ జడ్జిగా ఎదగాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు మూడు సంవత్సరాల పాటు జీతాన్ని కోల్పోయినప్పటికి జీవితంలో తాను నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోగలిగింది. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందినప్పటికీ, కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకుంటూ తన ఇద్దరు చిన్నారులకు తల్లీ తండ్రీ తానై... అనుకున్నది సాధించింది. ఆదిలాబాద్‌కు చెందిన కల్లెడ సౌజన్య జిల్లా కేంద్రంలోని ఎస్సీఎస్టీ కోర్టులో స్టెనోగా పనిచేస్తూనే, ఇటీవల హైకోర్టు నిర్వహించిన మెజిస్ట్రేట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, తన జీవితానికి తానే తీర్పు చెప్పుకున్నారు. ఈనెల 14న న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సౌజన్య జీవన గమ్యం... నిజామాబాద్ జిల్లాకి చెందిన శంకర్ శాస్త్రి– శోభ దంపతుల ముగ్గురు సంతానంలో ఒక్కగానొక్క ఆడపిల్ల సౌజన్య. న్యూ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీ ఉద్యోగి అయిన శంకర్ శాస్త్రి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో పనిచేశారు. దాంతో సౌజన్య ప్రాథమిక విద్య నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ, 8వ తరగతి నుంచి ఆదిలాబాద్‌లోనూ చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ చేశారు. ఇంటర్ చదివేటప్పుడే టైప్ షార్ట్‌హ్యాండ్ కోర్సు చేశారు. డిగ్రీ పూర్తి కాగానే ఆదిలాబాద్ జిల్లాలోని బో«ద్ కోర్టులో స్టెనోగా చేరారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లోని ఆయా కోర్టుల్లో పనిచేస్తూ వచ్చారు. దుఃఖాన్ని దిగమింగుకుంది స్టెనోగా కోర్టులో ఉద్యోగం వచ్చిన తర్వాత సౌజన్యకు 2001లో వెటర్నరీ డాక్టర్ రమాకాంత్‌తో వివాహం జరిగింది. వారికి కూతురు సాక్షి, కుమారుడు కృష్ణ సంతానం. అంతా సాఫీగా సాగిపోతోందనుకున్న తరుణంలో... నార్నూర్‌లో పశువైద్యాధికారిగా పనిచేస్తున్న రమాకాంత్, 2010 నవంబర్‌లో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. అప్పుడు వారి పిల్లలు ఇద్దరు పసివాళ్లే. భర్త మృతితో సౌజన్య జీవితంలో విషాదం చోటుచేసుకుంది. అయితే అంత దుఃఖాన్నీ దిగమింగుకొని పిల్లల కోసం జీవితంతో పోరాడింది. వారే లోకంగా బతికింది. ప్రస్తుతం పిల్లలు ఇద్దరు ఆదిలాబాద్ పట్టణంలోని కాన్వెంట్ హైస్కూల్లో 6, 8 తరగతులు చదువుతున్నారు. సంకల్పమే నడిపించింది కోర్టులో 19 సంవత్సరాలుగా స్టెనోగా చేస్తున్న సౌజన్య కోర్టులో జరిగే వ్యవహారాలను దగ్గరినుంచి చూసింది. ప్రధానంగా మెజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చే తీర్పులను షార్ట్‌హ్యాండ్‌లో రాసుకొని ఆ తర్వాత కంప్యూటర్లో ఆ తీర్పును సవివరంగా పొందుపరిచి మెజిస్ట్రేట్‌కు అందజేయడం ఆమె బాధ్యత. ఇన్నేళ్ల ఈ ప్రస్థానంలో ఆమె మనసులో తాను ఎలాగైనా మెజిస్ట్రేట్ కావాలన్న ఆలోచనకు బీజం పడింది. ‘లా’ చదివితేగానీ తన లక్ష్యంలో తొలి మెట్టు ఎక్కలేదు మరి. ఆమె ఆశయాన్ని అమ్మానాన్నా అర్థం చేసుకున్నారు. తోబుట్టువులు సంజీవ్, సందీప్‌లు తోడుగా నిలిచారు. సౌజన్య నాందేడ్‌లో లా కోర్సు చదివారు. మూడేళ్లపాటు జీతాన్ని కోల్పోవాల్సి వచ్చినా సంకల్పాన్ని వీడకుండా ముందుకు సాగారు. 2015లో లా కోర్సును పూర్తిచేసి తిరిగి ఉద్యోగంలో చేరారు. ఆమె కల ఇప్పటికి నెరవేరింది. మొన్న మంగళవారం మేడ్చల్ కోర్టు ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకుంది హైకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మెజిస్ట్రేట్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో రెండు రాత పరీక్షలు, ఒక ఓరల్ టెస్ట్‌లో ఆమె అర్హత సాధించారు. ఏప్రిల్‌లో దీనికి సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 52 మంది మెజిస్ట్రేట్లుగా ఎంపికయ్యారు. అందులో సౌజన్య ఒకరు. మంగళవారం హైకోర్టు మెజిస్ట్రేట్లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువరిచింది. పాత రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ కోర్టులో ఆమె మేజిస్ట్రేట్‌గా ఈ నెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. సౌజన్య జీవిత గమనం అనేకమంది మహిళలకు ఆదర్శం. – గొడిశెల కృష్ణకాంత్ గౌడ్, సాక్షి, ఆదిలాబాద్ ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
సౌజన్యకు మూడో సీడింగ్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో ముగ్గురు హైదరాబాద్ క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నగరానికి చెందిన భవిశెట్టి సౌజన్య, నిధి చిలుముల, ప్రాంజల ఈ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో సౌజన్య మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుండగా... నిధి, ప్రాంజలకు వరుసగా ఐదు, ఏడో సీడింగ్స్ దక్కాయి. డబుల్స్ విభాగంలో నిధి–శ్వేత రాణా జోడీకి రెండో సీడ్ దక్కగా, ప్రాంజల జంట మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుంది. -
నేరెడ్‌మెట్‌లో మహిళ హల్చల్
ఇద్దరు చిన్నారులను నీటి సంపులో పడేసేందుకు యత్నించిన మహిళను స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన నగరంలోని నేరెడ్మెట్ రమాబ్రహ్మంనగర్లో శుక్రవారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో నివాసముంటున్న సౌజన్య గత కొంత కాలంగా ఉన్మాదిలా మారి తనను తాను గాయపర్చుకోవడం లేదా.. ఎవరిపైనైనా దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు చిన్నారులను సంపులో వేయడానికి యత్నించింది. దీన్ని అడ్డుకునేందుకు చూసిన చిన్నారుల తల్లిపై కారం చల్లి ఆమెను గాయపరిచింది. గత కొన్నెళ్లుగా ఈమె బారిన పడిన స్థానికులు సౌజన్యపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అందర్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా.. తనను హింసిస్తున్నారని తిరిగి కాలనీ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తోందని.. రోజురోజుకు సౌజన్య ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులను చుట్టుముట్టిన స్థానికులు ఆ మహిళ నుంచి రక్షణ కల్పించాలని మొర పెట్టుకుంటున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
బూర్జ: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లక్కపురానికి చెందిన ఎం.సౌజన్య(16) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య పాలకొండలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
సౌజన్య మృతి కేసులో కీలక సమాచారం
విజయవాడ: ఇటీవల నగరంలో కలకలం రేపిన సౌజన్య అనే నవ వధువు అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి కీలక సమాచారం లభించింది. సౌజన్య మరణానికి ముందు ముంబైకి చెందిన వ్యక్తితో సెల్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో పాటు ఆభరణాలు ఇంట్లోనే ఉంచిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకే ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మే 27 వ తేదీన అజిత్‌సింగ్ నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని అపార్ట్మెంట్ నుంచి కిందకు పడి సౌజన్య మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా?లేక ఎవరైనా అనే దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు రెండో కుమార్తె సౌజన్యకు ఈ నెల 20వ తేదీన వివాహం జరిగింది. సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమెకు కృష్ణలంకకు చెందిన దిలీప్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహం అయింది. దంపతులు ఇద్దరూ హైదరాబాద్‌లోనే కాపురం పెట్టిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. -
సౌజన్య దూకేసిందా? ఎవరైనా తోసేశారా?
విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో సౌజన్య అనే నవ వధువు అనుమానాస్పద మృతికి సంబంధించి తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. అజిత్‌సింగ్ నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని అపార్ట్మెంట్ నుంచి ఆమె కిందకు పడుతున్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సౌజన్య ఆత్మహత్యకు ఒడిగట్టిందా? లేక ఎవరైనా కిందకు తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 27న సౌజన్య మృతదేహం రోడ్డుపై పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు రెండో కుమార్తె సౌజన్యకు ఈ నెల 20వ తేదీన వివాహం జరిగింది. సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమెకు కృష్ణలంకకు చెందిన దిలీప్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహం అయింది. దంపతులు ఇద్దరూ హైదరాబాద్‌లోనే కాపురం పెట్టారు. వారం రోజుల పాటు భర్తతో కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లి వచ్చింది. కాగా ఈ నెల 27వ తేదీన భర్తతో కలిసి హైదరాబాద్ కు వెళ్లాల్సి వుంది. అయితే అదే రోజు లోటస్ ల్యాండ్ మార్క్లోని అయిదో అంతస్తు నుంచి సౌజన్య కిందపడి మృతి చెందింది. ఆ సమయంలో తల్లిదండ్రులు తెనాలిలోని ఓ వివాహానికి వెళ్లారు. అదేరోజు సౌజన్య ఎనిమిదో బ్లాక్‌లోకి వెళ్లినట్లు సీసీ టీవీ పుటేజ్ ద్వారా తెలుస్తోంది. తరవాత ఆమె అయిదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి కింది పడినట్లు దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనితో అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఉపయోగించిన సెల్ ఫోన్లోని డేటా ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. సౌజన్య తలకు స్కార్ఫ్ కట్టుకుని వుండటంతో ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిందా, లేక ఆత్మహత్యకు ప్రయత్నించిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దంపతుల మధ్య కలహాలే.. ఈ మరణానికి దారితీశాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది. కాగా ఈ ఘటనపై సౌజన్య కుటుంబం మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. అసలే కూతురు చనిపోయిన బాధలో ఉన్న ప్రశ్నలతో వేధించవద్దంటూ సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. -
షాపింగ్‌కు వచ్చి కొడుకుతో సహా అదృశ్యం
హైదరాబాద్ : షాపింగ్‌కు వచ్చిన వైద్యుడు తన కుమారుడితో సహా అదృశ్యమయ్యాడు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న సౌజన్య శ్రీదేవి, డాక్టర్ దిలీప్‌కుమార్(40) దంపతులు. సౌజన్య జేఎన్టీయూహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా.., దిలీప్ చందానగర్‌లోని సాయి సౌజన్య ఆసుపత్రిలో డాక్టర్. గతేడాది అక్టోబర్ 25న సౌజన్య, దిలీప్‌లు కుమారుడు సాయి (4)తో కలిసి షాపింగ్‌కు వచ్చి ప్రగతినగర్ విజేత సూపర్‌మార్కెట్ సమీపంలో కారు నిలిపారు. పాల ప్యాకెట్ కోసం సౌజన్య సూపర్ మార్కెట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న దిలీప్‌తో పాటు కుమారుడు సాయి కనిపించలేదు. దీంతో బంధువుల ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాకబు చేసినా ఫలితం లేదు. దీంతో సౌజన్య తన భర్త, కుమారుడు అదృశ్యమయ్యారంటూ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లెక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్ దాడి
గుంటూరు : గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో శనివారం దారుణం జరిగింది. ఓ లెక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్‌తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను ఆస్పత్రికి తరలించారు. కాగా తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. నరసరావుపేటకు చెందిన సౌజన్యను అదే పట్టణంలో ఓ ప్రైవేటు కాలేజిలో మాథ్స్ లెక్చరర్‌గా పనిచేసే వెంకటరమణ కొన్నాళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి కొంతకాలం కలిసి తిరిగాడు. తర్వాత నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజిలో చేరాడు. గత ఆగస్టు 15వ తేదీన అతడికి మరో యువతితో పెళ్లయింది. ఎందుకిలా మోసం చేశావంటూ దీనిపై సౌజన్య అతడిని నిలదీయగా, కావాలంటే రెండోపెళ్లి చేసుకుంటానంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన సౌజన్య.. యాసిడ్ తీసుకుని కాలేజి వద్దకు వచ్చింది. వెంకటరమణను కాలేజి నుంచి బయటకు పిలిపించి, మొహం మీద, శరీరం మీద యాసిడ్ పోసింది. దాంతో అతడి ఒళ్లంతా కాలిపోయింది. ప్రస్తుతం అతడు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు గానీ, తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉంది. -
మోసం చేసినందునే.. యాసిడ్ దాడి చేశా!
-
లెక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్ దాడి