తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో సూపర్ హిట్‌లు కొట్టడమే కాకుండా బాక్సాఫీసుల వద్ద కలెక్షన్స్ సునామీని తెచ్చిన డైరెక్టర్‌గా ఆయనకు ఎనలేని గుర్తింపు ఉంది. అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు, ఇటు మాస్‌ను మెప్పించగల దర్శకుడు ఆయన. కొద్దిరోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు.
మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఆమె కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్- మీనాక్షి చౌదరి కాంబోలో ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మాతగా సౌజన్యనే తెరకెక్కిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్-సౌజన్య కుమారుడు రిషీ మనోజ్ దర్శకుడిగా పరిచయం కానున్నట్లు ధృవీకరించారు. ఇప్పటికే రిషీ పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌తో పాటు అతని కుటుంబం ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు.
ఇటీవలే సౌజన్య తన సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా రావడం ప్రారంభించారు. అయితే, ఇదిగో త్రివిక్రమ్ కుమారుడు రిషీ తాజా చిత్రం అంటూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని షేర్ చేశాడు. ఆ ఫోటోలో సౌజన్య కూడా ఉన్నారు. ముగ్గురూ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు.
ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ డైరెక్టర్ పిల్లలు మాత్రం పెద్దగా సినీ ఇండిస్ట్రీలో అడుగుపెట్టన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. టాలెంట్ ఉంటేనే ఈ పరిశ్రమలో సక్సెస్ అవుతారు. మొదటి అడుగు వరకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. ఆపై కొనసాగాలంటే తనలోని సత్తాను నమ్ముకోవాల్సిందే. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ కొడతారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment