షాపింగ్కు వచ్చి కొడుకుతో సహా అదృశ్యం
హైదరాబాద్ : షాపింగ్‌కు వచ్చిన వైద్యుడు తన కుమారుడితో సహా అదృశ్యమయ్యాడు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న సౌజన్య శ్రీదేవి, డాక్టర్ దిలీప్‌కుమార్(40) దంపతులు. సౌజన్య జేఎన్టీయూహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా.., దిలీప్ చందానగర్‌లోని సాయి సౌజన్య ఆసుపత్రిలో డాక్టర్.
గతేడాది అక్టోబర్ 25న సౌజన్య, దిలీప్‌లు కుమారుడు సాయి (4)తో కలిసి షాపింగ్‌కు వచ్చి ప్రగతినగర్ విజేత సూపర్‌మార్కెట్ సమీపంలో కారు నిలిపారు. పాల ప్యాకెట్ కోసం సౌజన్య సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న దిలీప్‌తో పాటు కుమారుడు సాయి కనిపించలేదు. దీంతో బంధువుల ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాకబు చేసినా ఫలితం లేదు. దీంతో సౌజన్య తన భర్త, కుమారుడు అదృశ్యమయ్యారంటూ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.