సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలోని యానింగ్ నగరంలో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య (భారత్)–డాన్ ని వాంగ్ (చైనా) ద్వయం 7–6 (7/4), 7–5తో మూడో సీడ్ ఐసువాన్ చో–యి సెన్ చో (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. 24 ఏళ్ల సౌజన్యకిది కెరీర్‌లో ఎనిమిదో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2015లో రిషిక సుంకరతో కలిసి నాసిక్ ఐటీఎఫ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సౌజన్య నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment