బూర్జ: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లక్కపురానికి చెందిన ఎం.సౌజన్య(16) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య పాలకొండలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.