
టైటిల్ పోరుకు సంజన
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 టెన్నిస్ టోర్నమెంట్‌లో సంజన ఫైనల్లోకి అడుగు పెట్టింది. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఈ టోర్నీ జరుగుతోంది. సెమీఫైనల్లో 12 ఏళ్ల సంజన 6–3, 6–2తో టాప్ సీడ్ భక్తి షాపై సంచలన విజయాన్ని సాధించింది.
ఈ టోర్నీలో క్వాలిఫయర్స్ ఆడి మెయిన్స్‌కు అర్హత సాధించిన సంజన తొలి రౌండ్‌లో 9–4తో పూర్వ రెడ్డిపై, రెండో రౌండ్‌లో 6–3, 6–0తో నాలుగో సీడ్ వుదులా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 6–3, 6–3తో మూడో సీడ్ కిరణ్ రాణిపై గెలుపొందింది.