
శ్రావ్య శివానికి డబుల్స్ టైటిల్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని సత్తా చాటింది.
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని సత్తా చాటింది. తనీషా కశ్యప్ (భారత్)తో జతకట్టిన శ్రావ్య శివాని డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఎల్బీ స్టేడియం ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో రెండో సీడ్ శ్రావ్య శివాని–తనీషా కశ్యప్ ద్వయం 6–4, 6–4తో నాలుగో సీడ్ ఆలియా ఇబ్రహీమ్–శివాని స్వరూప్ ఇంగ్లే (భారత్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన అమినేని శివాని రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ శివాని 4–6, 2–6తో టాప్ సీడ్ ఆకాంక్ష భాన్ (భారత్) చేతిలో పరాజయం పాలైంది.