sravya shivani
-
సెమీస్‌లో శ్రావ్య శివాని
సాక్షి, హైదరాబాద్: చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం (సీఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి శ్రావ్య శివాని నిలకడగా రాణిస్తోంది. పంజాబ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శ్రావ్య శివాని సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ శ్రావ్య శివాని (తెలంగాణ) 6–2, 6–4తో ఏడో సీడ్ అవి కా సాగ్వల్ (ఢిల్లీ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ లక్ష్మీసాహితి రెడ్డి (ఆంధ్ర ప్రదేశ్) 6–2, 6–4తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. -
శ్రావ్య శివానికి డబుల్స్ టైటిల్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని సత్తా చాటింది. తనీషా కశ్యప్ (భారత్)తో జతకట్టిన శ్రావ్య శివాని డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఎల్బీ స్టేడియం ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో రెండో సీడ్ శ్రావ్య శివాని–తనీషా కశ్యప్ ద్వయం 6–4, 6–4తో నాలుగో సీడ్ ఆలియా ఇబ్రహీమ్–శివాని స్వరూప్ ఇంగ్లే (భారత్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన అమినేని శివాని రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ శివాని 4–6, 2–6తో టాప్ సీడ్ ఆకాంక్ష భాన్ (భారత్) చేతిలో పరాజయం పాలైంది. -
శ్రావ్య శివాని జోడీకి టైటిల్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-5 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రావ్య శివాని జోడీ సత్తా చాటింది. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ టోర్నీలో బాలికల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను కై వసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రావ్య శివాని- తనీషా కశ్యప్ (భారత్) ద్వయం 6-4, 6-4తో శ్రీవల్లి రష్మిక (భారత్)- మారియా కృపేనినా (రష్యా) జోడీపై గెలుపొందింది.