
సాక్షి, హైదరాబాద్: చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం (సీఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి శ్రావ్య శివాని నిలకడగా రాణిస్తోంది. పంజాబ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శ్రావ్య శివాని సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ శ్రావ్య శివాని (తెలంగాణ) 6–2, 6–4తో ఏడో సీడ్ అవి కా సాగ్వల్ (ఢిల్లీ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ లక్ష్మీసాహితి రెడ్డి (ఆంధ్ర ప్రదేశ్) 6–2, 6–4తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది.