అందుబాటులోకి ‘టెన్నిస్‌ హబ్‌’ రిటైల్‌ స్టోర్‌ | Tennis Retail Hub In Hyderabad | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి ‘టెన్నిస్‌ హబ్‌’ రిటైల్‌ స్టోర్‌

Jan 9 2020 10:51 AM | Updated on Jan 9 2020 10:51 AM

Tennis Retail Hub In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు ఆన్‌లైన్‌ సేవలకే పరిమితమైన ‘టెన్నిస్‌హబ్‌’ స్టోర్‌ ఇక నుంచి రిటైల్‌ సేవలను అందించనుంది. భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, లండన్‌ ఒలింపిక్స్‌లో ఆడిన టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ 2013లో  tennishub.inపేరుతో ఏర్పాటు చేసిన ‘ఈ కామర్స్‌’ కంపెనీ ఇప్పుడు నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ అప్‌మార్కెట్‌లో ఏర్పాటైన ఈ రిటైల్‌ స్టోర్‌ను భారత టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా ప్రారంభించారు.

భారత్‌లోనే తొలిసారిగా హైదరా బాద్‌లో ఏర్పాటైన ఈ స్టోర్‌లో ప్రొఫెషనల్‌ క్రీడాకారులకు కావాల్సిన టెన్నిస్‌ ఎక్విప్‌మెంట్‌ సహా రాకెట్‌ డెమో ప్రోగ్రామ్‌లాంటి వినూత్న సేవలు అందుబాటులో ఉండనున్నాయి. దీనితో పాటు ‘టాలెంట్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌’ను సానియా ఆవిష్కరించారు. భారత్‌లో ప్రతిభ గల యువ క్రీడాకారులు, జాతీయ, అంతర్జాతీయ టోరీ్నల్లో రాణించేందుకు అవసరమైన సహాయ సహకారాలు ఈ ప్రోగ్రామ్‌ ద్వారా అందజేస్తారు. ఇందులో భాగంగా జూనియర్‌ స్థాయిలో విశేషంగా రాణిస్తోన్న హైదరాబాద్‌ క్రీడాకారులకు సానియా టెన్నిస్‌ కిట్‌లను అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement