హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి కాకపోతే వైద్య వృత్తిని ఎంచుకునేదాన్నని భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టు ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై కోర్టును ప్రారంభించింది. ఓఎంసీ–1980 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కాలేజి కోసం రూ. 66 లక్షలు విరాళంగా అందించారు. కాలేజిలో సింథటిక్ టెన్నిస్ కోర్టును నిర్మించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనంలో డాక్టర్ అవ్వాలనుకున్నానని చెప్పింది. ఉస్మానియాలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కాలేజి కోసం విలువైన సౌకర్యాలను కల్పించడం అభినందనీయమన్నారు. తాము చదువుకున్న కాలేజికి చేయూతనివ్వడాన్ని ఆమె ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శశికళ, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎ. శ్రీనివాస్, డాక్టర్ శ్రీలత, ప్రతిని«ధులు మనోజ్‌చంద్ర దీపక్, సుబ్రమణ్యం, శ్యాంసుందర్, విజయ్‌శేఖర్ రెడ్డి, మధుశేఖర్, ప్రణతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment