సెమీస్‌లో విష్ణువర్ధన్‌ జోడీ | vishnu vardhan pair enter semis of itf tourny | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో విష్ణువర్ధన్‌ జోడీ

Published Thu, Mar 16 2017 11:20 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

సెమీస్‌లో విష్ణువర్ధన్‌ జోడీ

సెమీస్‌లో విష్ణువర్ధన్‌ జోడీ

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. కర్ణాటక స్టేట్‌ లాన్‌టెన్నిస్‌ అసోసియేషన్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్న విష్ణువర్ధన్‌... సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ  ద్వయం 7–5, 6–1తో జుయ్‌–చెన్‌ హంగ్‌ (చైనీస్‌ తైపీ)–హాంగ్‌ కిట్‌ వాంగ్‌ (హాంకాంగ్‌) జంటపై గెలుపొందగా... అనిరుధ్‌–విఘ్నేశ్‌ జోడీ∙(భారత్‌) 5–7, 3–6తో అలెగ్జాండర్‌ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్‌ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.

 

మరోవైపు సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ విష్ణువర్ధన్‌ 6–2, 6–1తో భారత్‌కే చెందిన దక్షిణేశ్వర్‌ సురేశ్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ 6–2, 7–5తో సిద్ధార్థ్‌ విశ్వకర్మపై గెలుపొందగా... రిషబ్‌ అగర్వాల్‌ 4–6, 4–6తో హాడిన్‌ బావా (భారత్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement