tennis tourny
-
రన్నరప్ విష్ణువర్ధన్ జోడి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2, 4–6, 6–10తో రెండో సీడ్ ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–4, 6–4తో సామి రెన్‌వెన్ (జర్మనీ)పై, శ్రీరామ్ బాలాజీ 4–6, 6–3, 7–5తో కరుణుదయ్ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. -
సెమీస్‌లో విష్ణువర్ధన్ జోడీ
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. కర్ణాటక స్టేట్ లాన్‌టెన్నిస్ అసోసియేషన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్న విష్ణువర్ధన్... సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–5, 6–1తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... అనిరుధ్–విఘ్నేశ్ జోడీ∙(భారత్) 5–7, 3–6తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–2, 6–1తో భారత్‌కే చెందిన దక్షిణేశ్వర్ సురేశ్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 6–2, 7–5తో సిద్ధార్థ్ విశ్వకర్మపై గెలుపొందగా... రిషబ్ అగర్వాల్ 4–6, 4–6తో హాడిన్ బావా (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
ఆకాంక్ష, కౌశిక్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో కౌశిక్ కుమార్ రెడ్డి, ఆకాంక్ష సత్తా చాటారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో ఆకాంక్ష 8–3తో సౌమ్య జైన్‌ను ఓడించగా... బాలుర విభాగంలో వల్లంరెడ్డి కౌశిక్ 8–7 (1)తో ప్రతినవ్పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రతినవ్ 8–1తో జిహర్పై, కౌశిక్ 8–2తో హేమంత్ సాయి ప్రభపై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీఎస్‌టీఏ కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
రన్నరప్ అపురూప్ రెడ్డి
సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అండర్–18 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్రానికి చెందిన అపురూప్ రెడ్డి, భక్తి షా ఆకట్టుకున్నారు. త్రివేండ్రమ్‌లో జరిగిన ఈ టోర్నీలో అపురూప్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి రెండు పతకాలను సాధించగా... భక్తి డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని దక్కించుకుంది. బాలుర సింగిల్స్ ఫైనల్లో వీఎం సందీప్ (తమిళనాడు) 3–6, 6–3, 6–1తో పి. అపురూప్ రెడ్డి (తెలంగాణ)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో అపురూప్‌రెడ్డి – సంజయ్ (కేరళ) ద్వయం 4–6, 4–6తో ఎస్. భూపతి–వీఎం సందీప్ (తమిళనాడు) జంట చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో ఆలియా జుబేర్ (మహారాష్ట్ర)–భక్తి షా (తెలంగాణ) జంట 3–6, 4–6తో త్రిష (కేరళ)– ప్రేరణ (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని దక్కించుకుంది. -
రన్నరప్ సాయిదేదీప్య జోడి
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. భీమవరంలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో దేదీప్య జోడి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాయిదేదీప్య– వై. సహజ (ఏపీ) ద్వయం 0–6, 2–6తో ఈతీ మహిత–సౌమ్య విగ్ (గుజరాత్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
దక్షిణ మధ్య రైల్వేకు రజతం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రైల్వే టెన్నిస్ టోర్నమెంట్లో దక్షిణ మధ్య రైల్వే జట్టు (ఎస్సీఆర్) ఆకట్టుకుంది. లక్నోలోని రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)లో జరిగిన ఈ టోర్నీలో ఎస్సీఆర్ జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇందులో మొత్తం 12 జట్లు పాల్గొనగా దక్షిణ మధ్య రైల్వే జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్రన్ రైల్వే జట్టు 2-1తో ఎస్సీఆర్పై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఎస్సీఆర్ జట్టు 2-1తో సౌత్ ఈస్ట్రన్ రైల్వేపై, 2-0తో ఆర్డీఎస్ఓ జట్టుపై గెలుపొందింది. స్నూకర్ రన్నరప్ పాండురంగయ్య జాతీయ సీనియర్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్పీబీ)కి చెందిన పాండురంగయ్య అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడిన ఈ టోర్నీలో రంగయ్య రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచి మెరుగ్గా రాణించిన పాండురంగయ్య ఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ అడ్వానీ (పీఎస్‌పీబీ)చేతిలో ఓడిపోరుు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్... రైల్వే పురుషుల టెన్నిస్ జట్టును, పాండు రంగయ్యను అభినందించారు. -
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో దేదీప్య 6-1, 6-3తో పూజా ఇంగ్లే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో తను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్ఞానితతో తలపడుతుంది. -
శివానికి నిరాశ
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని పోరాటం ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో శివాని పరాజయం పాలైంది. స్థానిక సీఎల్‌టీఏ టెన్నిస్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో రియా వర్మ (భారత్) 6-3, 7-6 (5)తో శివానిపై గెలుపొందింది. డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో శివాని- వైదేహి చౌదరీ (భారత్) జంట 3-6, 3-6తో కున్ రుు లీ- మనంచయ సావంగ్ జోడీ చేతిలో ఓడిపోరుుంది. ఇతర బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మెహక్ జైన్ (భారత్) 6-0, 6-0తో వైదేహి చౌదరీపై, అక్సానా మరీన్ (బెల్జియం) 6-3, 6-1తో ఆకాంక్ష భాను (భారత్)పై, థసపోర్న్ (థారుులాండ్) 6-1, 6-1తో తనీషా కశ్యప్ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలుర సింగిల్స్ క్వార్టర్స్: సిద్ధాంత్ బాంటియా (భారత్) 6-2, 7-5తో టోంక్లా ములదా (థారుులాండ్)పై, ధ్రువ్ సునీశ్ (భారత్) 6-2, 6-2తో దోస్టాన్బెక్ తశ్బులటోవ్ (కజకిస్థాన్)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ సెమీస్: వశిష్ట్ చెరకు- జాక్ జోడీ 6-2, 6-4తో సిద్ధాంత్ బాంటియా- పరీక్షిత్ సోమని జంటపై నెగ్గింది. -
17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందిరాపార్క్ వేదికగా పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. గురువారం లోపు ఎంట్రీలు పంపించాలి. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం 9246365620, 9000225533 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సెమీఫైనల్లో నీల్‌కంఠ్, మణికందన్
సాక్షి, హైదరాబాద్: జీవీకే జాతీయ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో నీల్‌కంఠ్, మణికందన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన 45 ఏళ్లుపైబడిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నీల్‌కంఠ్ 6-1, 6-2తో తులేశ్వర్ సింగ్‌పై, మణికందన్ 6-4, 6-3తో సి.వి.ఆనంద్‌పై గెలుపొందారు. మిగతా మ్యాచ్‌ల్లో కె.వి.ఎన్.మూర్తి 2-6, 7-5 (11/9)తో అజయ్ కామత్‌పై, అర్ముగం 6-0, 6-0తో దినేశ్‌పై నెగ్గారు. ప్లస్ 55 పురుషుల క్వార్టర్ ఫైనల్లో మయూర్ వసంత్ 6-1, 6-0తో యోగేశ్ షాపై, శంకర్ 6-2, 6-3తో ధనుంజయులుపై, మేఘనాథన్ 6-2, 6-2తో సేతుపై, శ్రీనివాస్ రెడ్డి 6-3, 6-4తో రామరాజుపై విజయం సాధించారు. ప్లస్ 65 పురుషుల క్వార్టర్స్‌లో గంగాధరన్ 2-6, 6-3 (12/10)తో రాంమోహన్ రావుపై, తటవర్తి పద్మాలు 6-4, 6-3తో రాధాకృష్ణన్‌పై, వి.ఆర్.కులకర్ణి 6-1, 6-2తో అశోక్ రెడ్డిపై, రామారావు 6-1, 6-1తో సుధాకర్ రెడ్డిపై గెలుపొందారు. -
ప్రి క్వార్టర్స్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య ముందంజ వేసింది. పుణేలోని బాలేవాడి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బాలికల సింగిల్స్ తొలిరౌండ్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6-3, 6-1తో కె. విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్‌లో రోహిత్, వైభవ్
సాక్షి, హైదరాబాద్: ఇండస్ స్కూల్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహిత్ అయ్యర్, వైభవ్ శివ్ కుమార్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన అండర్-14 బాలుర రెండోరౌండ్లో వైభవ్ 6-5 (8/6)తో జయేశ్ అగర్వాల్‌పై విజయం సాధించాడు. అండర్-12 బాలుర రెండో రౌండ్లో రోహిత్ అయ్యర్ 6-4తో ఎన్‌వీఎల్‌ఎన్ రాజు పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: అండర్-14 బాలురు: కాశీ విశ్వనాథ 6-1తో జైవంత్పై, రుషి చక్ర 6-0తో రుహల్ రెగడమిల్లిపై, హరి హశ్వత 6-2తో సనానండ్ర ప్రజ్ఞపై, అర్య జాదవ్ 6-5 (5)తో యువరాజపై, నాథన్ పీటర్ 6-1తో ధనుశ్ వర్మపై, వర్షిత్ కుమార్ 6-1 ఆర్యన్ సామల్, సిద్ధార్థ్ 6-5 (6)తో రోహన్‌పై, అనీశ్ రెడ్డి 6-4తో లిఖిత్ రెడ్డిపై, ఉప్ప సనీత్ 6-2తో రోహిత్ తరుణ్, సిద్ధార్థ్ శ్రీనివాస్ 6-1తో మనన్ భయానీపై గెలుపొందారు. అండర్-12 బాలురు: అనీశ్ రెడ్డి 6-0తో మనోహర్‌పై, వినీత్ 6-1తో ఆర్యబ్పై, రుషిచక్ర 6-1తో జైసింహాపై, లిఖిత్ రెడ్డి 6-4తో నీరజ్‌పై, శ్రీనాథ్ కోట 6-4తో సనీత్‌పై, తరుణ్ 6-1తో హేమంత్ సాయిపై, గౌరవ్ కృష్ణ 6-4తో రోహిత్ సాయిపై, ఆర్యంత్ రెడ్డి 6-1తో ప్రణవ్ రెడ్డిపై విజయం సాధించారు. -
సెమీస్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల బాలికల సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 6-4, 6-4తో తనకన్నా మెరుగైన క్రీడాకారిణి నటాషా పల్హాపై విజయం సాధించింది. -
పోరాడి ఓడిన శివాని
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్స్టార్స్ ఫైనల్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు అమినేని శివాని రన్నరప్‌గా నిలిచింది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని పోరాడి ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆస్ట్రే లియా అమ్మాయి వయోలెట్ అపిసా 7-5, 6-4తో శివానిపై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ ఫిత్రియాని సబటిని (ఇండోనేసియా)పై 6-2, 6-1తో సంచలన విజయం సాధించిన శివాని ఫైనల్లో విజయం కోసం తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్‌గా నిలిచింది. అండర్-14 బాలికల విభాగంలో భారత్‌కే చెందిన తనిషా కశ్యప్ సెమీఫైనల్లో ఓడిపోయింది. గత ఏడాది ఇదే టోర్నీలో అండర్-16 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల విజేతగా నిలిచింది. -
29 నుంచి టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది. సైనిక్‌పురిలోని రామ టెన్నిస్ అకాడమీలో అండర్-10, 12, 14 బాలబాలికల విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం 9949466400, 9989629944 నంబర్లలో సంప్రదించగలరు. -
ప్రాంజలకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌తో జతకట్టిన ప్రాంజల బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్మెంట్ సెంటర్లో శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో యడ్లపల్లి ప్రాంజల-జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-1, 6-3తో కున్-రుు-లీ (చైనీస్ తైపీ)-మనన్చయ సవాంగ్కవ్ (థాయ్‌లాండ్) జోడీపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
రెండో రౌండ్లో ఆర్నిరెడ్డి, మేఘన
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్- 16 టెన్నిస్ టోర్నమెంట్లో ఆర్నిరెడ్డి, మేఘన ముందంజ వేశారు. బోరుున్పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో శనివారం జరిగిన బాలికల తొలిరౌండ్లో మేఘన (తెలంగాణ) 7-4తో జయకృష్ణ ఆరాధన (తమిళనాడు)పై, ఆర్నిరెడ్డి (తెలంగాణ) 7-4తో ఖుషీరావుపై విజయం సాధించారు. బాలుర విభాగంలో రిత్విక్ 7-2తో నివాస్‌పై గెలుపొందగా... కనిష్క్ పాండే (తెలంగాణ) 2- 7తో శ్రీవాత్సన్ (కర్నాటక)చేతిలో ఓడాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలురు: అర్నవ్ కుమార్ 7-6 (5)తో ఆదిత్యపై, యశోదన్ 7-2తో విధుర్పై, అర్జున్ గొల్లపూడి 7-2తో వర్షిత్ కుమార్‌పై, ప్రతినవ్ 7-1తో రిషి చక్రపై విజయం సాధించారు. బాలికలు: పావని 7-0తో రచెల్ ఏంజెలాపై, కుంకుమ్ 7-1తో అభిషితా రెడ్డిపై, మృదుల 7-0తో నిర్ణయ సురాపూర్పై గెలుపొందారు. -
తుదిపోరుకు శివాని
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. సింగపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శివాని ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో శివాని 6-1, 6-2తో ఫిత్రినా సబటిని (ఇండోనేసియా)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది. -
దేదీప్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య డబుల్స్ విభాగంలో టైటిల్‌ను కై వసం చేసుకంది. బెంగళూరులో జరిగిన ఈ టోర్నమెంట్ బాలికల డబుల్స్‌లో సాయి దేదీప్య (తెలంగాణ)- ధారణ ముదలియార్ (ఛత్తీస్‌గఢ్) జంట 6-3, 4-6, 10-8తో సృ్మతి సింగ్ (ఢిల్లీ)- పార్వి పాటిల్ (కర్నాటక) జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. మరోవైపు బాలికల సింగిల్స్‌లో ఈ హైదరాబాదీ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. దేదీప్య 6-4, 2-6, 2-6తో ప్రతిభ (కర్నాటక) చేతిలో ఓడిపోయింది. -
ఫైనల్లో ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్మెంట్ సెంటర్లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాం జల- జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-4, 7-5తో హిండోవా (చెక్ రిపబ్లిక్)- అర్పన (ఫిన్లాండ్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 5-7, 4-6తో సుహ్యున్ పార్క్ (కొరియా) చేతిలో పరాజయం పాలైంది. -
సౌజన్య జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సాధించింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకరతో కలసి సౌజన్య విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య-రిషిక ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో శ్వేతా రాణా (ఢిల్లీ)-ఇతీ మెహతా (గుజరాత్) జోడీపై విజయం సాధించింది. అండర్-18 బాలికల డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి శ్రావ్య శివాని-తనీషా కశ్యప్ (అస్సాం) జంట 6-1, 7-6 (7/5)తో సభ్యత నిహ్లాని (ఢిల్లీ)-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జోడీని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో హుమేరా అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి షేక్ హుమేరా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో హుమేరా 4-6, 6-3, 6-2తో హైదరాబాద్‌కే చెందిన యెద్దుల సారుు దేదీప్యపై కష్టపడి గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో ఆకాంక్ష భాన్ (గుజరాత్)తో హుమేరా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ఆకాంక్ష 6-2, 6-1తో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు లలిత దేవరకొండను ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల 4-6, 3-6తో ఇతీ మెహతా (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-3, 6-1తో కునాల్ ఆనంద్ (ఢిల్లీ)పై గెలిచాడు. ఫైనల్లో సిద్ధార్థ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్)తో విష్ణు ఆడతాడు. -
అక్టోబర్ 2 నుంచి టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: శ్రీజ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. అండర్-8, అండర్-16 బాలబాలికలు, మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టోర్నమెంట్ డెరైక్టర్ పి. విజయ్ భాస్కర్ రెడ్డి (9642711188)ను సంప్రదించవచ్చు. -
ఫైనల్లో శ్రీవల్లి -రష్మిక జోడి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రీవల్లి రష్మిక జోడి ఫైనల్‌కు చేరుకుంది. మారిషస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల డ బుల్స్ సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్)-కేటీ లాఫ్రాన్స్ (అమెరికా) జోడి 4-6, 7-5, 10-8తో స్నేహల్ మణె (భారత్)-వెరొనికా (పొలాండ్) జంటపై విజయం సాధించింది. టాప్‌సీడ్ జోడి చేతిలో తొలి సెట్ కోల్పోయిన రష్మిక జోడి తర్వాతి రెండు సెట్లలో విజయం సాధించింది. -
సెమీస్‌లో లాలస, సోమిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో లాలస, సోమిత సెమీస్‌లోకి ప్రవేశించారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో బుధవారం జరిగిన అండర్-14 బాలికల క్వార్టర్స్ ఫైనల్లో లాలస 6-2తో ఐరాసూద్పై గెలుపొందగా... సోమిత 6-3తో కుంకుమ్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రేష్ట 6-1తో తేజస్వినిపై, ఆర్ని రెడ్డి 6-3తో సుకృతపై పైచేయి సాధించారు. బాలుర క్వార్టర్స్‌లో ప్రణీత్ రెడ్డి 6-3తో వర్షిత్‌పై, హరిహశ్వంత్ 6-4తో అనీష్ రెడ్డిపై, ఆదిత్య 6-2తో కాశీ విశ్వనాథ రావుపై, ఆర్య జాదవ్ 6-2తో వరుణ్‌పై విజయం సాధించారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు అండర్-10 బాలురు: శౌర్య గుప్తా 6-5 (5)తో మిహిర్ పర్చాపై, చిత్రదర్శన్ 7-5తో ఆర్నవ్ బిషోయ్పై, ప్రణీత్ సింగ్ 6-3తో ధరణి దత్తపై, శ్రీ ప్రణవ్ 6-5 (2)తో వెంకట్ రిషిపై నెగ్గాయి. బాలికలు: వెన్నెల 6-1తో శివానిపై, సౌమ్య 6-0తో త్రినియాసిని రెడ్డిపై, నీరాలి 6-0తో మలిష్కపై గెలుపొందారు. అండర్-12 బాలురు: వర్షిత్ కుమార్ 6-1తో వరుణ్‌పై, లిఖిత్ 6-3తో యువరాజ్‌పై, హర్షవర్ధన్ 6-5 (11)తో సిద్ధార్థ్ శ్రీనివాస్‌పై, అనీష్ రెడ్డి 6-3తో ఆర్యంత్రెడ్డిపై పైచేయి సాధించారు. బాలికలు: శ్రీహిత 6-2తో నీరాలిపై, సౌమ్య 6-3తో రీతూపర్ణపై, ఆర్ని రెడ్డి 6-2తో చాందినిపై, కుంకుమ్ 6-2తో అదితి మీనన్‌పై విజయం సాధించారు.