
ఆకాంక్ష, కౌశిక్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కౌశిక్ కుమార్ రెడ్డి, ఆకాంక్ష సత్తా చాటారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో ఆకాంక్ష 8–3తో సౌమ్య జైన్‌ను ఓడించగా... బాలుర విభాగంలో వల్లంరెడ్డి కౌశిక్ 8–7 (1)తో ప్రతినవ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రతినవ్ 8–1తో జిహర్‌పై, కౌశిక్ 8–2తో హేమంత్ సాయి ప్రభపై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీఎస్‌టీఏ కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.