విజేత తనీషా | Tanisha Kashyap from India became the winner | Sakshi
Sakshi News home page

విజేత తనీషా

Published Mon, Oct 21 2024 3:19 AM | Last Updated on Mon, Oct 21 2024 3:19 AM

Tanisha Kashyap from India became the winner

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ15 టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన తనీషా కశ్యప్‌ విజేతగా నిలిచిది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అస్సాంకు చెందిన 22 ఏళ్ల తనీషా మూడు సెట్‌ల పోరాటంలో విజయాన్ని అందుకుంది. భారత్‌కే చెందిన ఆకాంక్ష నిట్టూరేతో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తనీషా 6–7 (5/7), 6–1, 6–1తో గెలుపొందింది. 

తద్వారా తన కెరీర్‌లో తొలి ఐటీఎఫ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో తనీషా 10 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో చేజార్చుకున్న తనీషా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు గేమ్‌లను మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను దక్కించుకుంది. 

తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన తనీషా ప్రత్యర్థి సర్విస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్‌ చేసింది. చాంపియన్‌ తనీషాకు 2,352 డాలర్లు (రూ. 1 లక్షా 97 వేలు), రన్నరప్‌ ఆకాంక్షకు 1,470 డాలర్లు (రూ. 1 లక్షా 23 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement