తండ్రి సైన్యంలో పనిచేస్తుండడంతో ఆకాంక్ష ప్రియదర్శిని బాల్యం దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో గడిచింది. పచ్చదనం అంటే చెప్పలేనంత ఇష్టం. రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన ఆకాంక్షకు కాలుష్య సమస్య గురించి ఆందోళనగా ఉండేది.
వాయు కాలుష్య ప్రభావంతో తన బంధువులు, కాలేజి స్నేహితులలో కొందరికి శ్వాసకోశ సమస్యలు రావడం ఆమెను కలవరపరిచింది. వాయు కాలుష్యంకు సంబంధించి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలనే లక్ష్యంతో క్లైమెట్ టెక్ స్టార్టప్ ‘ఆరాసుర్’ప్రారంభించింది. ఒడిషాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్ ‘ఆరాసుర్’ ప్రయాణం మొదలైంది.
వైర్లెస్, సెన్సర్ ఆధారిత సాంకేతిక సహాయంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉన్న సమాచార అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ చురుగ్గా పనిచేస్తోంది. హైపర్–లోకల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సందేహాలకు సమాధానం చెప్పడానికి మా హార్డ్‌వేర్ పరికరాల నుంచి సేకరించిన డేటా ఉపయోగపడుతుంది.
ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా జెనరేట్ చేయాలి....అనే విషయాలకంటే పర్యావరణ విషయాలకేప్రాధాన్యత ఇచ్చాం’ అంటుంది ఆకాంక్ష. హార్డ్‌వేర్ డిజైనింగ్, సప్లైచైన్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్, ఇన్‌స్టాలేషన్... మొదలైన వాటిలో ప్రావీణ్యం సాధించిన ఆకాంక్ష ‘మల్టీటాలెంటెడ్’గా గుర్తింపు పొందింది.
ఇవి చదవండి: Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్‌తోనే.. రాగాల రారాజుగా..
Comments
Please login to add a commentAdd a comment