సెమీఫైనల్లో నీల్‌కంఠ్, మణికందన్ | neelakhant enters semis in tennis tourny | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో నీల్‌కంఠ్, మణికందన్

Published Sat, Dec 10 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

neelakhant enters semis in tennis tourny

సాక్షి, హైదరాబాద్: జీవీకే జాతీయ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నీల్‌కంఠ్, మణికందన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన 45 ఏళ్లుపైబడిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నీల్‌కంఠ్ 6-1, 6-2తో తులేశ్వర్ సింగ్‌పై, మణికందన్ 6-4, 6-3తో సి.వి.ఆనంద్‌పై గెలుపొందారు. మిగతా మ్యాచ్‌ల్లో కె.వి.ఎన్.మూర్తి 2-6, 7-5 (11/9)తో అజయ్ కామత్‌పై, అర్ముగం 6-0, 6-0తో దినేశ్‌పై నెగ్గారు.

 

ప్లస్ 55 పురుషుల క్వార్టర్ ఫైనల్లో మయూర్ వసంత్ 6-1, 6-0తో యోగేశ్ షాపై, శంకర్ 6-2, 6-3తో ధనుంజయులుపై, మేఘనాథన్ 6-2, 6-2తో సేతుపై, శ్రీనివాస్ రెడ్డి 6-3, 6-4తో రామరాజుపై విజయం సాధించారు. ప్లస్ 65 పురుషుల క్వార్టర్స్‌లో గంగాధరన్ 2-6, 6-3 (12/10)తో రాంమోహన్ రావుపై, తటవర్తి పద్మాలు 6-4, 6-3తో రాధాకృష్ణన్‌పై, వి.ఆర్.కులకర్ణి 6-1, 6-2తో అశోక్ రెడ్డిపై, రామారావు 6-1, 6-1తో సుధాకర్ రెడ్డిపై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement