సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లాలస, సోమిత సెమీస్‌లోకి ప్రవేశించారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం జరిగిన అండర్-14 బాలికల క్వార్టర్స్ ఫైనల్లో లాలస 6-2తో ఐరాసూద్‌పై గెలుపొందగా... సోమిత 6-3తో కుంకుమ్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రేష్ట 6-1తో తేజస్వినిపై, ఆర్ని రెడ్డి 6-3తో సుకృతపై పైచేయి సాధించారు. బాలుర క్వార్టర్స్‌లో ప్రణీత్ రెడ్డి 6-3తో వర్షిత్‌పై, హరిహశ్వంత్ 6-4తో అనీష్ రెడ్డిపై, ఆదిత్య 6-2తో కాశీ విశ్వనాథ రావుపై, ఆర్య జాదవ్ 6-2తో వరుణ్‌పై విజయం సాధించారు.
ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు
అండర్-10 బాలురు: శౌర్య గుప్తా 6-5 (5)తో మిహిర్ పర్చాపై, చిత్రదర్శన్ 7-5తో ఆర్నవ్ బిషోయ్‌పై, ప్రణీత్ సింగ్ 6-3తో ధరణి దత్తపై, శ్రీ ప్రణవ్ 6-5 (2)తో వెంకట్ రిషిపై నెగ్గాయి.
బాలికలు: వెన్నెల 6-1తో శివానిపై, సౌమ్య 6-0తో త్రినియాసిని రెడ్డిపై, నీరాలి 6-0తో మలిష్కపై గెలుపొందారు.
అండర్-12 బాలురు: వర్షిత్ కుమార్ 6-1తో వరుణ్‌పై, లిఖిత్ 6-3తో యువరాజ్‌పై, హర్షవర్ధన్ 6-5 (11)తో సిద్ధార్థ్ శ్రీనివాస్‌పై, అనీష్ రెడ్డి 6-3తో ఆర్యంత్‌రెడ్డిపై పైచేయి సాధించారు.
బాలికలు: శ్రీహిత 6-2తో నీరాలిపై, సౌమ్య 6-3తో రీతూపర్ణపై, ఆర్ని రెడ్డి 6-2తో చాందినిపై, కుంకుమ్ 6-2తో అదితి మీనన్‌పై విజయం సాధించారు.