పోరాడి ఓడిన శివాని | shivani defeated in wta future stars finals tourny | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన శివాని

Published Mon, Oct 24 2016 11:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

shivani defeated in wta future stars finals tourny

సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్‌స్టార్స్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు అమినేని శివాని రన్నరప్‌గా నిలిచింది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని పోరాడి ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆస్ట్రే లియా అమ్మాయి వయోలెట్ అపిసా 7-5, 6-4తో శివానిపై విజయం సాధించింది.

 

శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ ఫిత్రియాని సబటిని (ఇండోనేసియా)పై 6-2, 6-1తో సంచలన విజయం సాధించిన శివాని ఫైనల్లో విజయం కోసం తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్‌గా నిలిచింది. అండర్-14 బాలికల విభాగంలో భారత్‌కే చెందిన తనిషా కశ్యప్ సెమీఫైనల్లో ఓడిపోయింది. గత ఏడాది ఇదే టోర్నీలో అండర్-16 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల విజేతగా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement