సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్- 16 టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆర్నిరెడ్డి, మేఘన ముందంజ వేశారు. బోరుున్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్‌లో శనివారం జరిగిన బాలికల తొలిరౌండ్‌లో మేఘన (తెలంగాణ) 7-4తో జయకృష్ణ ఆరాధన (తమిళనాడు)పై, ఆర్నిరెడ్డి (తెలంగాణ) 7-4తో ఖుషీరావుపై విజయం సాధించారు. బాలుర విభాగంలో రిత్విక్ 7-2తో నివాస్‌పై గెలుపొందగా... కనిష్క్ పాండే (తెలంగాణ) 2- 7తో శ్రీవాత్సన్ (కర్నాటక)చేతిలో ఓడాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
బాలురు: అర్నవ్ కుమార్ 7-6 (5)తో ఆదిత్యపై, యశోదన్ 7-2తో విధుర్‌పై, అర్జున్ గొల్లపూడి 7-2తో వర్షిత్ కుమార్‌పై, ప్రతినవ్ 7-1తో రిషి చక్రపై విజయం సాధించారు.
బాలికలు: పావని 7-0తో రచెల్ ఏంజెలాపై, కుంకుమ్ 7-1తో అభిషితా రెడ్డిపై, మృదుల 7-0తో నిర్ణయ సురాపూర్‌పై గెలుపొందారు.