సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రైల్వే టెన్నిస్ టోర్నమెంట్‌లో దక్షిణ మధ్య రైల్వే జట్టు (ఎస్‌సీఆర్) ఆకట్టుకుంది. లక్నోలోని రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ)లో జరిగిన ఈ టోర్నీలో ఎస్‌సీఆర్ జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇందులో మొత్తం 12 జట్లు పాల్గొనగా దక్షిణ మధ్య రైల్వే జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్రన్ రైల్వే జట్టు 2-1తో ఎస్‌సీఆర్‌పై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఎస్‌సీఆర్ జట్టు 2-1తో సౌత్ ఈస్ట్రన్ రైల్వేపై, 2-0తో ఆర్‌డీఎస్‌ఓ జట్టుపై గెలుపొందింది.
స్నూకర్ రన్నరప్ పాండురంగయ్య
జాతీయ సీనియర్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్‌ట్స ప్రమోషన్ బోర్డ్ (ఆర్‌ఎస్‌పీబీ)కి చెందిన పాండురంగయ్య అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడిన ఈ టోర్నీలో రంగయ్య రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచి మెరుగ్గా రాణించిన పాండురంగయ్య ఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ అడ్వానీ (పీఎస్‌పీబీ)చేతిలో ఓడిపోరుు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్... రైల్వే పురుషుల టెన్నిస్ జట్టును, పాండు రంగయ్యను అభినందించారు.
దక్షిణ మధ్య రైల్వేకు రజతం
Published Tue, Feb 7 2017 8:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
Advertisement
Advertisement