సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గోల్డెన్ జూబ్లీ జనరల్ మేనేజర్ చెస్ కప్ సోమవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని బోయిగూడ రైల్ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే క్రీడా సంఘం (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ (జీఎం) వినోద్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీకి 200మందికి పైగా చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. ఎస్‌సీఆర్‌కు చెందిన విక్రమ్‌జీత్ సింగ్ టాప్ సీడ్‌గా, తెలంగాణకు చెందిన వి. వరుణ్ రెండో సీడ్‌గా బరిలోకి దిగారు.
టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 2.38 లక్షలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు అర్జున్ ముండియా, కార్యదర్శి ఈవీ కృష్ణారెడ్డి, తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఎస్‌సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం. ఉమాశంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment