ప్రిక్వార్టర్స్‌లో సహజ  | Sahaja in prequarters | Sakshi

ప్రిక్వార్టర్స్‌లో సహజ 

Feb 29 2024 12:07 AM | Updated on Feb 29 2024 12:07 AM

Sahaja in prequarters - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలుగు ప్లేయర్లు  సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఐదో సీడ్‌ సహజ 6–4, 6–2తో జపాన్‌కు చెందిన కొషిషి అయుమిపై గెలుపొందగా, శ్రీవల్లి రష్మిక 6–1, 6–2తో క్వాలిఫయర్‌ యమజకి ఐకుమి (జపాన్‌)పై అలవోక విజయం సాధించింది. డబుల్స్‌ బరిలోనూ దిగిన రష్మిక క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ప్రిక్వార్టర్స్‌లో రష్మిక–వైదేహి చౌదరి జోడీ 6–0, 6–1తో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ పొందిన భారత జంట కశిష్‌ భాటియా–సాహిర సింగ్‌పై గెలిచింది. టాప్‌సీడ్‌ అంకిత రైనా (భారత్‌)– కులంబయెవా జిబెక్‌ (కజకిస్తాన్‌) జంట 2–6, 6–3, 11–9తో జీల్‌ దేశాయ్‌ (భారత్‌)–ఒకువకి రినొన్‌ (జపాన్‌) ద్వయంపై గెలిచింది. మిగతా సింగిల్స్‌ పోటీల్లో రియా భాటియా 7–6 (7/5), 6–4తో భారత క్వాలిఫయర్‌ అంజలిని ఓడించింది. హుమేరా బహర్మస్‌ 1–6, 0–6తో కులంబయెవా జిబెక్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement