తుదిపోరుకు శివాని | shivani enters final in tennis tourny | Sakshi
Sakshi News home page

తుదిపోరుకు శివాని

Published Sat, Sep 3 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

shivani enters final in tennis tourny

టెన్నిస్ టోర్నమెంట్  


సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్‌లో అమినేని శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమినేని శివాని 6-3, 1-6, 6-0తో సామ సాత్వికపై విజయం సాధించింది.

అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శివాని 6-1, 4-6, 6-3తో హెచ్. షేక్‌పై, సామ సాత్విక 6-4, 6-1తో వి.చౌదరీపై, భాను 6-3, 6-2తో ఏ. చక్రవర్తిపై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎన్. సిన్హా 6-2, 6-3తో సోలెంకి అలెక్స్‌పై, ఉనిష్ 6-4, 7-4 (4)తో వశిష్ట్‌పై, ఎస్. బాంతియా 6-2, 6-1తో వన్నెం రెడ్డిపై, పి. సోమని 6-3, 6-3తో ఎస్. జగ్‌త్యానిపై నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement