
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు కాజా వినాయక్ శర్మకు బుధవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. చండీగఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్‌లో సెమీస్‌కు చేరిన వినాయక్ శర్మ సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు.
పురు షుల డబుల్స్ క్వార్టర్స్‌లో మోహిత్ మయూర్ జయప్రకాశ్– వినాయక్ శర్మ జంట 7–5, 5–4 (రిటైర్డ్ హర్ట్)తో విజయంత్ మలిక్–దల్విందర్ సింగ్ (భారత్) జోడీపై నెగ్గింది. నేడు జరిగే సెమీస్‌లో కునాల్ ఆనంద్–షాబాజ్ ఖాన్ (భారత్) జంటతో వినాయక్ శర్మ ద్వయం తలపడుతుంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వినాయక్ శర్మ 4–6, 2–6తో దల్విందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment