
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–3 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. పుణేలోని డెక్కన్ జింఖానా గ్రౌండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీస్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్‌లో రష్మిక 4–6, 6–3, 3–6తో జటవపోర్నవంతి పిమ్రద (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment