విష్ణుకు మరో డబుల్స్ టైటిల్
త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడి సత్తా చాటింది. త్రివేండ్రంలో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–3, 7–5తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది.
విష్ణువర్ధన్ కెరీర్‌లో ఇది 33వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సింగిల్స్ సెమీఫైనల్లో విష్ణువర్ధన్ 3–6, 2–6తో శ్రీరామ్ బాలాజీ చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–0, 6–3తో దల్వీందర్ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాడు.