క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్
భిలాయ్ (ఛత్తీస్‌గఢ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీఎస్పీ టెన్నిస్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–1, 6–0తో భారత్‌కే చెందిన విజయంత్ మలిక్‌పై విజయం సాధించాడు. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ జోడి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ– విష్ణువర్ధన్ ద్వయం 7–6 (7/3), 6–2తో మోహిత్ మయూర్–నికి కలియండ (భారత్) జంటపై నెగ్గింది.
గురువారం జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ రావత్‌తో విష్ణువర్ధన్ తలపడతాడు. ఇతర సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–2, 6–3తో మోహిత్ మయూర్‌పై, సిద్ధార్థ్ రావత్ 6–1, 6–0తో శివదీప్ కొసరాజుపై, శశికుమార్ ముకుంద్ 7–5, 6–4తో తేజస్‌పై, సిద్ధార్థ్ విశ్వకర్మ 4–6, 6–3, 6–1తో రిషబ్ అగర్వాల్‌పై గెలుపొందారు. డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో కునాల్ ఆనంద్–అన్విత్ బింద్రె జోడి (భారత్) 6–2, 6–1తో ఆర్యన్– శశికుమార్ ముకుంద్ (భారత్) జంటపై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.