
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్–5 బాలుర టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయి కార్తీక్ రెడ్డి రాణించాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 614వ స్థానంలో ఉన్న కార్తీక్ శనివారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో 2–6, 5–7తో అబెదల్లా షెల్‌బా (జోర్డాన్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో కార్తీక్ 6–3, 6–3తో మొహమ్మద్ బర్హామ్ (ట్యునీషియా)పై, క్వార్టర్స్‌లో 6–0, 7–5తో అర్జున్ మరియప్ప (అమెరికా)పై విజయాలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment